రాజీవ్ గాంధీ హత్యకు మురారి మూవీకి ఉన్న లింక్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే?

మహేష్ బాబు సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మురారి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబుకు జోడీగా సోనాలి బింద్రే నటించగా ఈ జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కృష్ణవంశీకి గోదావరి జిల్లాలలో గడపటం ఎంతో ఇష్టం కాగా కెరీర్ తొలినాళ్లలో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి.

అయితే ఒకానొక సమయంలో ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ ఆకస్మికంగా మరణించారనే విషయాన్ని కృష్ణవంశీ గమనించారు. అయితే శాపం వల్లే ఈ విధంగా జరిగిందని కొందరు చెప్పిన విషయాలను కృష్ణవంశీ గమనించారు. మరి కొందరి జీవితాలలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. కృష్ణవంశీ ఈ ఘటనల ఆధారంగా స్క్రిప్ట్ ను సిద్ధం చేయాలని భావించారు.

కృష్ణ వీరాభిమాని అయిన రామలింగేశ్వరరావు అనే నిర్మాత ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. పేపర్ పై స్క్రిప్ట్ ను సిద్ధం చేయకుండానే మనసులో మురారి స్క్రిప్ట్ ను కృష్ణవంశీ సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేశారు. మహేష్ బాబు కృష్ణవంశీతో లవ్ స్టోరీ చేయాలని అనుకున్నారు. మురారి మూవీ చరిత్రలో నిలిచిపోతుందని కృష్ణవంశీ మహేష్ ను ఒప్పించారు.

ఎంతో కష్టపడి కృష్ణవంశీ ఈ సినిమా క్లైమాక్స్ ను తయారు చేశారు. నిర్మాత సూచన మేరకు మురారి అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈ విధంగా రాజీవ్ గాంధీ హత్యకు మురారి మూవీ కథకు లింక్ కుదిరింది. మురారి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సోనాలి బింద్రేకు కూడా ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. దర్శకుడిగా కృష్ణవంశీకి ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.