అమెరికా అబ్బాయిని జగపతిబాబు అల్లుడిగా చేసుకోవడానికి కారణం తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా దశాబ్దాల పాటు కెరీర్ ను కొనసాగించిన జగపతిబాబు సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. కుటుంబ కథా చిత్రాలలో నటించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన ఈ హీరో ఆ ప్రయోగాలతో ఎక్కువసార్లు విజయాలను అందుకున్నారు. తల్లి కోరిక మేరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న జగపతి బాబు తర్వాత కాలంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

జగపతిబాబు నటించిన తొలి సినిమా సింహస్వప్నం కాగా ఆ సినిమాలో జగపతిబాబు డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించడం గమనార్హం.ఆ తర్వాత పలు కుటుంబ కథా చిత్రాలలో నటించిన జగపతిబాబు గాయం సినిమాతో తొలి హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. జగపతిబాబు నటించిన శుభలగ్నం సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఈ నటుడు కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు.

శుభలగ్నం సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్టర్ కాగా ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు తెరకెక్కాయి. తర్వాత రోజుల్లో జగపతిబాబుకు మహిళా ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే జగపతిబాబు అమెరికా అబ్బాయిని అల్లుడిగా చేసుకున్నారనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం కావడం గమనార్హం.

జగపతిబాబు పెద్ద కుమార్తె మేఘన 2015లో చాక్ బోవిన్ అనే అమెరికన్ ను వివాహం చేసుకున్నారు. మేఘన అమెరికాలో పీజీ చదువుతున్న సమయంలో బోవిన్ తో ప్రేమలో పడిందని కూతురు ప్రేమకు జగపతిబాబు అడ్డు చెప్పలేదని సమాచారం. హైదరాబాద్ లో జగపతిబాబు కూతురు వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు కెరీర్ ను కొనసాగిస్తున్నారు.