30 సంవత్సరాల క్రితమే చిరంజీవి నటించిన పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే పాన్ ఇండియా సినిమాలు మొదలయ్యాయని చాలామంది భావిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి 30 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా సినిమాలో నటించడం గమనార్హం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి అప్పట్లోనే పాన్ ఇండియా మూవీలో నటించారని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ తొలినాళ్లలో కౌబాయ్ సినిమాలలో నటించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ రోల్ లో నటించిన మోసగాళ్లకు మోసగాడు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కాలంలో కొంతమంది హీరోలు కౌబాయ్ పాత్రలలో నటించి మెప్పించారు.

కృష్ణ సినిమాల స్థాయిలో తెరకెక్కిన కౌబాయ్ చిత్రం ఏదనే ప్రశ్నకు మాత్రం కొదమసింహం సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది. కొదమసింహం సినిమా చిరంజీవి కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు. చిరంజీవి పూర్తిస్థాయిలో కౌబాయ్ రోల్ లో నటించిన సినిమా మాత్రం ఇదేనని సమాచారం. చిరంజీవిని కౌబాయ్ రోల్ లో చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మురళీమోహనరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిర్మాత కైకాల నాగేశ్వరరావు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లోనే ఈ సినిమా 4 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఎంతోమంది ప్రముఖ నటులు నటించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. కొదమసింహం సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.