ఫ్యాక్ట్ : “RRR” లో చరణ్ ఎంట్రీ సీన్ అన్ని రోజులు షూట్ చేసారా..!

ఒక హీరో ఓ దర్శకునితో సినిమా చేసాడు అనే దానికి ఎంత హైప్ ఉంటుందో.. అదే విధంగా ఆ హీరోకి సినిమాలో ఎలాంటి ఇంట్రడక్షన్ ఇచ్చాడు అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. తమ హీరోపై ఒక సరైన ఓపెనింగ్ పడితే థియేటర్స్ దద్దరిల్లుతాయి. అయితే  ఇలాంటి వాటికి దర్శకులు ఎక్కువగా భారీ యాక్షన్ సీక్వెన్స్ లనే ఎంచుకుంటారు.

 

అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్(RRR) లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని అల్లూరి సీతా రామరాజుగా దర్శకుడు రాజమౌళి తీసిన ఈ పవర్ ఫుల్ ఎంట్రీ సీన్ అయితే మన ఇండియన్ సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ హైలైట్ సీన్ గా నిలిచింది. ఈ సినిమా చూసాక ఇప్పటికీ చాలా మందిని వెంటాడుతున్న సీన్ ఇది.

 

అయితే ఈ పవర్ ఫుల్ సీన్ ని ఎన్ని రోజులు తెరకెక్కించారో ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ టోటల్ సీక్వెన్స్ ని ఏకంగా 32 రోజులు పాటు తీవ్రంగా శ్రమించి వేలాది మంది ఆర్టిస్టులతో చేశారట. సినిమాలో దాదాపు 10 నిముషాలు లోపు ఉండే ఈ సీన్ వెనుక ఇంత కష్టం ఉంది. అయితే దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం సెన్సేషనల్ గా దక్కింది అని చెప్పాలి.