Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వివాదంలో చెక్కుకున్నారు ఇటీవల ఈయన మహా కుంభమేళాకు తన మూడో భార్య, అలాగే రెండో భార్య కుమారుడితో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే వీరితో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహా కుంభమేళాకు వెళ్లి అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించి త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు చేసే అనంతరం హారతులు కూడా ఇచ్చారు.
ఇలా పవన్ కళ్యాణ్ నది స్నానం ఆచరిస్తున్న సమయంలో ఆయన షర్టు తీసేయడంతో ఆయన మెడలో జంధ్యం కనిపించింది. ఇలా పవన్ కళ్యాణ్ మెడలో జంధ్యం వేసుకోవడంతో చాలామంది అసలు ఇలాంటి వాటిని బ్రాహ్మణులు లేదా వైశ్యులు మాత్రమే వేసుకుంటారు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు వేసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జంధ్యం వేసుకోవడానికి పలు కారణాలను కూడా తెలియజేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా దీక్ష లేదా హోమాలు చేస్తున్న సమయంలో ఇలాంటి వాటిని వేసుకుంటారు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రాయశ్చిత దీక్ష వంటివి చేశారు. ఇక ప్రస్తుతం ఈయన సనాతన ధర్మం టూర్ అంటూ కూడా పలు ఆలయాలను సందర్శిస్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ జంధ్యం వేసుకున్నారని తెలుస్తోంది.
ఇకపోతే కాపులలో కూడా కొంతమంది ఇలా జంధ్యం ధరించే ఆనవాయితీ కూడా ఉందని తెలుస్తుంది. కాపులు యజ్ఞోపవీతం జంధ్యం ధరిస్తారని కూడా ఒక ప్రచారం ఉంది. అలాగే జంధ్యం వేసుకోవడం వైదిక సాంప్రదాయం అని.. బలిజల్లో క్షత్రియ బలిజలు జంధ్యం ధరిస్తారని కూడా కొందరు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి పవన్ ఏ కారణం చేత ఈ జంద్యం వేసుకున్నారు అనేదానిపై స్పష్టత లేకపోయినా ఈయన ధరించిన జంధ్యం గురించి మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.