Jr Ntr : ఇన్సైడ్ టాక్ : ఎన్టీఆర్ కావాలనే ఈ కథ ఎంచుకున్నాడా.?ఎందుకంటే?

Jr Ntr :  టాలీవుడ్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ తో రెడీగా ఉన్నాడు. అలాగే దీని అనంతరం మరికొన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లతో ఎన్టీఆర్ తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటుండడగా ఈ లైనప్ లో ఆకస్మికంగా వచ్చిన దర్శకుడే బుచ్చిబాబు సాన.

తన మొదటి సినిమా “ఉప్పెన” తోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ కొత్త దర్శకుడు ఎన్టీఆర్ ని డైరెక్ట్ చెయ్యనున్నాడు అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా తోనే ఇంట్రెస్టింగ్ గా ఒక అంశం సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఎన్టీఆర్ కావాలనే బుచ్చి బాబు కథని ఎంచుకున్నాడట.

దీనికి గట్టి రీజన్ కూడా వినిపిస్తుంది. ఈ సినిమాని బుచ్చి బాబు ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తయారు చేసాడట. అంటే ఒక రంగస్థలం, పుష్ప తరహాలో పాతకాలపు కథలా తయారు చెయ్యడమే కాకుండా ఎన్టీఆర్ పాత్రని కూడా చాలా ఛాలెంజింగ్ గా డిజైన్ చేసాడట.

అందుకే ఎన్టీఆర్ కావాలనే ఈ కథను ఎంచుకున్నాడని ఇన్సైడ్ టాక్. మరి ఆల్రెడీ ఈ సినిమా కథను విజయనగరం ప్రాంతంలో ఒక మూడు ఏరియాల్లో నడిచే కథల తీర్చిదిద్దారని తెలిసింది. మరి తారక్ అసలు ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడో ఎంత ఇంపాక్ట్ కలిగిస్తాడో చూడాలి.