ఇన్సైడ్ టాక్ : పవన్ సినిమా నుంచి తప్పుకున్న స్టార్ హీరోయిన్..?

Pawan Movie

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అవి కాకుండా రాజకీయ పనుల్లో బాగా బిజీగా ఉండడంతో సినిమాలు కాస్త వెనక్కి వెళ్లాయి. దీనితో ఆ సినిమా నటీ నటులు ఇతర సినిమాల కోసం షెడ్యూల్ చేసుకుంటున్నారు.

లేదా పవన్ లేని సీన్స్ లో నటించి వెళ్లిపోతున్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ నటించబోయే సినిమాల్లో భారీ అంచనాలు నెలకొల్పుకొని ఓ సినిమా “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా ఉంది. తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీని ప్రకారం అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిన హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్నట్టుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులు కితం వరకు ఈ సినిమాలో ఆమె ఉన్నట్టే చెప్పింది. మరి ఈ టాక్ లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి అయితే ఈమె ఈ సినిమా లేట్ అవుతుంది అనే కారణంతోనే తప్పుకుందని అంటున్నారు కానీ ఎక్కడా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతానికి అయితే దర్శకుడు, హీరోయిన్ సైలెంట్ గానే ఉన్నారు. మరి రానున్న రోజుల్లో అయినా ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.