ఇన్సైడ్ టాక్ : మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఈ భారీ సీన్ తో మొదలవుతుందట.!

తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో కొందరి హీరో మరియు దర్శకుల కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. అప్పటి వరకు వారికీ ప్లాప్ లు ఉన్నా కూడా ఒకసారి కాంబో సెట్ అయ్యింది అంటే ఆ సినిమాపై అంచనాలు భారీ లెవెల్ కి వెళ్తాయి.

అలాగే ఇప్పుడు వస్తున్న సెన్సేషనల్ కాంబో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లది అని చెప్పాలి. వీరి నుంచి వచ్చిన రెండు సినిమాలు కూడ ఆపెద్ద కమెర్షియల్ సక్సెస్ లు కాదు అయినా మూడో సినిమా అనౌన్స్ చేస్తే భారీ హైప్ సెట్ అయ్యింది.

ఇక ఈ సినిమా ఈ ఏడాది జులై నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. అయితే ఈ షూటింగ్ పై సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఫస్ట్ షూటింగే ఒక అదిరే ఏక్షన్ సీన్ తో స్టార్ట్ చేస్తున్నారట. ఇది భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సీన్ కూడా గ్రాండ్ గానే ఉంటుంది అని ఇన్సైడ్ టాక్.

అయితే ఈ షూటింగ్ ఏక్షన్ సీన్ తోనే స్టార్ట్ అవుతుంది అనే మాట కన్ఫర్మ్ అట. ఇంకా ఈ సినిమాలో మహేష్ తో జోడిగా మరోసారి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తాడు. అలాగే హారిక హాసిని ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తోనే నిర్మాణం వహిస్తున్నారు.