ఇన్సైడ్ టాక్ : “RRR” మాసివ్ ట్రైలర్ ఆగింది.!

దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు మాసివ్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మహా పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ అయినటువంటి ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నట్టుగా మొన్ననే అధికారికంగా వెల్లడి చేశారు.

కానీ ఇప్పుడు అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అందాకా ఆగిపోయినట్టు తెలుస్తుంది. నిజానికి ఈ డిసెంబర్ 3న ఈ ట్రైలర్ ని ఫిక్స్ చెయ్యగా ఇప్పుడు పలు కారణాల చేత ఈ ట్రైలర్ ని చిత్ర యూనిట్ అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. అయితే దీనికి గల అసలు కారణం ఏమిటి అన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఈ ట్రైలర్ కి సంబంధించి కొత్త డేట్ మరియు టైం ని మళ్ళీ అనౌన్స్ చేస్తారట.