ఇన్సైడ్ టాక్ : “RRR” భారీ ట్రైలర్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా?

పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ఏక్షన్ థ్రిల్లర్ ట్రిపుల్ ఆర్(RRR). ఇప్పటి వరకు కూడా సాలిడ్ అప్డేట్స్ తో అదరగొట్టిన చిత్ర యూనిట్ ఇక భారీ లెవెల్ లో ఉండే డ్యూయల్ ట్రైలర్ కట్ ని మేకర్స్ రెడీ చేస్తున్నారట.

మరి లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ట్రైలర్ ని చిత్ర బృందం వచ్చే డిసెంబర్ 5న కానీ 7న కానీ రిలీజ్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. కానీ ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ట్రైలర్ లాంచ్ అయితే ఈ పాటికే హంగామా మొదలయ్యేది. ఇంత తక్కువ గ్యాప్ లో ట్రైలర్ వచ్చేస్తుంది అంటే కాస్త ఆశ్చర్యమే అని చెప్పాలి.

మరి రాజమౌళి దీనికి ఎలాంటి ప్లాన్ చేసారో తెలియాలి అంటే వేచి ఉండాల్సిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అలియా భట్ మరియు అజయ్ దేవ్ గన్ లు మరో ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే డీవీవీ దానయ్య 500 కోట్ల మేర బడ్జెట్ తో తెరకెక్కించారు.