Pushpa : ఇన్సైడ్ టాక్ : “పుష్ప” పుకార్లలో అసలు ఎలాంటి నిజం లేదు!

Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప పార్ట్ 1”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తమ కెరీర్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చి అన్ని అంచనాలు అందుకొని భారీ వసూళ్ళని రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్స్ లోనే ఉండగా పలు రూమర్స్ ఈ చిత్రంపై వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి.

ఈ చిత్రం అప్పుడే జనవరి మొదటి వారం లోనే ఓటిటి లోనే రిలీజ్ అయ్యిపోతుంది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై తాజా సమాచారం ఒకటి తెలుస్తుంది. ఈ సినిమా అప్పుడే జనవరి లోనే ఓటిటి వీక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తుంది అనేది అబద్దం అట.

అసలు ఇలాంటి ఆలోచనే సినిమా యూనిట్ కి లేదని ఇండస్ట్రీ లో ఇన్సైడ్ టాక్. దీనితో పుష్ప శరవేగపు ఓటిటి రిలీజ్ పుకార్లలో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే వచ్చే మార్చ్ నుంచి రెండో పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానుంది.