ఇన్సైడ్ టాక్ : “పుష్ప 2” లో మైండ్ బ్లాక్ చేసే ఈ అంశం.!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఓ బాహుబలి ఓ కేజీఎఫ్ లాంటి చిత్రాలు తర్వాత అనేక అంచనాలు నెలకొల్పుకున్నా బిగ్గెస్ట్ సీక్వెల్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్న చిత్రం “పుష్ప 2” అనే చెప్పాలి.

దర్శకుడు సుకుమార్ తో అల్లు అర్జున్ చేసిన హ్యాట్రిక్ సినిమా ఇది కాగా దీనిపై అయితే అనేక అంచనాలు ఇప్పుడు సెట్టయ్యాయి. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉండగా దీనిని అయితే సుకుమార్ పార్ట్ 1 కన్నా భారీ హంగులతో ప్లాన్ చేస్తున్నాడు.

అభిమానులు చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా ఇప్పుడు పార్ట్ 2 పై అయితే ఐ క్రేజీ బజ్ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. సుకుమార్ ఈ సినిమా కోసం ఓ మైండ్ బ్లాక్ చేసే సీక్వెన్స్ ని రాసుకున్నాడట. దీనిని క్లైమాక్స్ లో రివీల్ చేస్తాడని తెలుస్తుంది.

దీనితో పుష్ప 2 క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరిని మైండ్ బ్లాక్ చేసి థ్రిల్ చేస్తుంది అని తెలుస్తుంది. సుకుమార్ చాలా కన్వీనెంట్ గా ఈ క్లైమాక్స్ ని రాసుకున్నాడని దీనితో సినిమా ఫలితం కూడా ఇంకో లెవెల్ కి వెళ్తుంది అని ఇన్సైడ్ టాక్. మరి ఈ సినిమాలో అయితే రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మరింత మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించనున్నారు.