RRR : ఇన్సైడ్ టాక్ : “RRR” వేడుకకి సీఎం జగన్ వస్తున్నాడా? క్లారిటీ మీకోసం!

RRR : ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా నుంచి మొత్తం పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మొట్ట మొదటి చిత్రం “ట్రిపుల్ ఆర్(RRR)”. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రెజెంట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి భాషలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చెయ్యడం జరిగింది.

ఆల్రెడీ హిందీలో బిగ్గెస్ట్ ఈవెంట్స్ తో అదరగొట్టేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాము. ఇక ఇవి పక్కన పెడితే మన తెలుగు వెర్షన్ కి మాత్రం గత కొన్ని వారల కితం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ముఖ్య అతిధిగా వస్తున్నాడని ఓ టాక్ వైరల్ గా మారింది. ఐతే ఇది అటు వైపు నుంచి వచ్చిన ఆర్డర్ అన్నట్టుగా ఊహాగానాలు వచ్చాయి.

కానీ ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ కీలక అంశంపై ఓ క్లారిటీ వినిపిస్తుంది. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ వేడుకకి జగన్ హాజరు అవుతున్నాడు అనే వార్త అవాస్తవం అని సినీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్. సో ఈ వైరల్ అయ్యిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక అనేక మంది దిగ్గజ నటులు నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కానుంది.