పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిన్ననే సరికొత్త రిలీజ్ డేట్ తో భారీ అనౌన్సమెంట్ ని ఇచ్చింది. ఎదురుగా ఏ సినిమా ఉన్నా కూడా వీరు కూడా వెనకడుగు వెయ్యం అన్నట్టు ఈ చిత్రం రిలీజ్ డేట్ ని జనవరి 12నే అని మళ్ళీ బల్ల గుద్ది చెప్పినట్టు అనౌన్స్ చేశారు. సరే ఇదిలా ఉండగా అసలు టెన్షన్ ఇక్కడ నుంచే పట్టుకుంది.
ఈ చిత్రం రిలీజ్ డేట్ తో భారీ సినిమాల వసూళ్లు అలాగే థియేటర్స్ కి దెబ్బ తప్పదని ఆ చిత్రాల యాజమాన్యం భావిస్తున్నారు. అందుకే భీమ్లా నాయక్ యూనిట్ పై బాగా ప్రెజర్ పెడుతున్నారట. సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకోవాలని పెద్ద లెవెల్లోనే ఒత్తిడి పెడుతున్నారని ఇన్సైడ్ టాక్. అయినా కూడా భీమ్లా బృందం మాత్రం వెనక్కి తగ్గేలా లేరని కూడా తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఈ రగడ ఎక్కడ ఆగుతుందో చూడాలి.