Bheemla Nayak : ఇన్సైడ్ టాక్ : “భీమ్లా నాయక్” మాస్ టీజర్ కట్ వచ్చేది అప్పుడేనట..డేట్ కన్ఫర్మ్!

Bheemla Nayak : ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు క్రేజీ మాస్ మల్టీ స్టారర్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి లతో మలయాళ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా దీనిని మరిన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా పరిస్థితులు బాగుండి ఉంటే ఈ జనవరి 12 నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ టాలీవుడ్ నిర్మాతల ఒత్తిళ్ల వల్ల పవన్ తన సినిమాను ఆపుకున్నాడు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ సీన్ అంతా కూడా సితార్ అయ్యింది. పవన్ తో పాటు ఏ పెద్ద సినిమా కూడా రాని పరిస్థితి ఇప్పుడు నెలకొంది.

మరి ఈ మధ్యలో అంతా భీమ్లా నాయక్ టీజర్ కట్ కోసం ఎదురు చూడడం డిమాండ్ చెయ్యడం స్టార్ట్ చేశారు. మరి దీనికి సమాధానంగా ఈ సంక్రాంతికి బహుశా ఉండొచ్చని ఊహాగానాలు వినిపించాయి కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్ ఈ మాస్ టీజర్ కట్ పై వినిపిస్తుంది. దాని ప్రకారం అయితే ఈ టీజర్ ని మేకర్స్ వచ్చే జనవరి 26 డేట్ కి ఫిక్స్ చేశారట.

ఆరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా వినిపిస్తున్న టాక్. మరి ఈ సినిమాలో నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా త్రివిక్రమ్ మాటలు, థమన్ సంగీతం అందిస్తున్నాడు.