Bheemla Nayak : ఇన్సైడ్ రిపోర్ట్స్ : ఎంత లేటయినా పవన్ సినిమా ఓ రేంజ్ లో వస్తుందట..!

Bheemla Nayak : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని మలయాళ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. మరి ఎప్పుడు నుంచో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారినట్లు గా చిత్ర బృందం రెండు కొత్త తేదీ లను అనౌన్స్ చేశారు.

మరి ఇదిలా ఉండగా ఈ కొత్త తేదీలు పక్కన పెడితే అసలు భీమ్లా నాయక్ సినిమా ఏ స్థాయిలో వస్తుంది. అంచనాలను అందుకునే రేంజ్ లో వస్తుందా లేదా అనే దానికి ఇన్సైడ్ రిపోర్ట్స్ కీలక సమాచారం ఇస్తున్నాయి. ఈ సినిమా ఔట్ పుట్ అంతా కూడా వేరే లెవెల్లో వస్తుందట. చిత్ర బృందం ఈ విషయం లో చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఒకవేళ పరిస్థితి ముందులా ఉంటే నాన్ బాహుబలి రేంజ్ హిట్ అయ్యినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో మరో హీరోగా రానా నటిస్తుండగా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.