ఐఎన్ఎస్ విక్రాంత్.! ఏదీ ఆ పబ్లిసిటీ.?

కొన్నాళ్ళ క్రితం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఎంత స్థాయిలో దేశవ్యాప్తంగా పబ్లిసిటీ స్టంట్స్ నడిచాయో చూశాం. కొద్ది రోజుల క్రితం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ పేరుతోనూ పొలిటికల్ పబ్లిసిటీ నడిచింది.

మరి, 20 వేల కోట్ల రూపాయల ఖర్చుతో తయారై, నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ విక్రాంత్ విషయంలో ఎందుకు పబ్లిసిటీ అంతలా జరగలేదు.? ఆ సంగతి పక్కన పెడితే, అసలెందుకు పబ్లిసిటీ జరగాలి.? అన్న ప్రశ్న ముందుగా తెరపైకొస్తుంది.

కొంచెం వెనక్కి వెళితే, ఐఎన్ఎస్ విరాట్ అనే యుద్ధ నౌక విషయంలో కేంద్రం చాలా చాలా చాలా చాలా నిర్లక్ష్యం వహించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఈ యుద్ధ నౌకను వుంచి, దాన్నొక మ్యూజియంగా మలచాలనే ప్రతిపాదనలు అప్పట్లో తెరపైకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ప్రయత్నించింది ఐఎన్ఎస్ విరాట్ కోసం.

ఐఎన్ఎస్ విరాట్ అనేది.. విమాన వాహక యుద్ధ నౌక. దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవలందించింది. అంతకు ముందు పాత ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళానికి సేవలందించింది. అది ఆ తర్వాత తుక్కుగా మారిపోయింది. ఆ పేరుతోనే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్.. మనదేశంలో తయారైంది. మన దేశం తయారు చేసుకున్న తొలి విమాన వాహక యుద్ధ నౌక ఈ కొత్త ఐఎన్ఎస్ విక్రాంత్.

నిజానికి ఇంతటి ప్రతిష్టాత్మక యుద్ధ నౌక, భారత అమ్ములపొదిలోకి చేరడమంటే.. ఆ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా యువతలో ఎంతటి అవగాహన వుండాలి.? ఎంతలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి.? ఓ సినిమాకి నడిచే పబ్లిసిటీ.. ఓ రాజకీయ పార్టీ చేసే హంగామా.. ఇవేవీ లేకుండా పోయాయ్ ఐఎన్ఎస్ విక్రాంత్ విషయంలో. 20 వేల కోట్లు.. భారతదేశ నౌకాదళం తాలూకు శక్తి.. మన సత్తా.. ఇవన్నీ

వున్నాయ్ ఐఎన్ఎస్ విక్రాంత్‌లో.!
చిత్రమేంటంటే, మన మీడియా కూడా తూతూ మంత్రంగా కవర్ చేసి ఊరుకుంది ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ వ్యవహారాన్ని.