Kajal In Megastar Acharya : ఇండస్ట్రీ టాక్ : కాజల్ కి అన్యాయం..ఆ లోటు అప్పుడు తీరుస్తారట..?

Kajal In Megastar Acharya : టాలీవుడ్ సినిమాలో ఉన్నంత కాలం కూడా మంచి క్రేజ్ మరియు డబ్బుని సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆనతి కాలంలోనే భారీ స్టార్డం తెచ్చుకున్న ఈ గ్లామరస్ బ్యూటీ ఇక ఏజ్ అయ్యే కొద్దీ సినిమాలు తగ్గించి పెళ్లి వైపు వెళ్ళింది.
గత లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది.
అయితే ఈమె పెళ్లి చేసుకున్నాక కూడా పలు ప్రాజెక్ట్స్ లో నటించింది. వాటిలో మెగాస్టార్ చిరంజీవితో చేసిన భారీ బడ్జెట్ సినిమా “ఆచార్య”. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా వారసుడు రామ్ చరణ్ కూడా నటించాడు.
అయితే ఈ సినిమాలో చిరు కి ఫీమేల్ లీడ్ లో కాజల్ నటించింది.
మరి అంతా బాగానే ఉన్నా తర్వాత రిలీజ్ చేసిన ట్రైలర్ చూసాక మాత్రం కాజల్ అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. అసలు ట్రైలర్ ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్ లో కూడా కాజల్ ని చూపించకపోవడం ఆసక్తిగా మారింది.
దీనితో కాజల్ కి అన్యాయం చేశారన్న మాట ఈ రెండు రోజులు నుంచి వినిపిస్తుంది.
అయితే మరి వారికి ఆ లోటుని చిత్ర యూనిట్ రెండో ట్రైలర్ తో తీరుస్తారని ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్. మరి అప్పుడైనా కాజల్ అభిమానులు శాంతిస్తారో లేదో చూడాలి.