ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ “సలార్” కి కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసేసారా?ఎప్పుడో తెలుసా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తోంది కొంతమంది ఉండగా తన మాస్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తోంది మరికొందరు ఉన్నారని చెప్పాలి. అయితే ఇందులో పెద్ద తేడా ఏముంది అంటే? ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ప్రభాస్ హీరోగా చేస్తున్నా సినిమాల్లో ఇప్పుడు వచ్చేవి “ఆది పురుష్” ఇంకా “సలార్” లు ఉన్నాయి.

అయితే వీటిలో ఓంరౌత్ తో సినిమా హిట్ అయితే అది నార్మల్ కం బ్యాక్ గాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసేది మాత్రం హిట్ అయితే అది మాస్ కం బ్యాక్ అని చెప్పాలి. ప్రభాస్ కెరీర్ లోనే సలార్ సినిమా భారీ ఏక్షన్ డ్రామాగా వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజీ టాక్ వినిపిస్తోంది.

దీనితో అయితే చిత్ర యూనిట్ గతంలో అనౌన్స్ చేసిన మాస్ డేట్ ఏప్రిల్ 14నే మళ్లీ సలార్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అంటే వచ్చే ఏడాది 2023 ఏప్రిల్ 14న ఈ మాస్ బ్లాస్ట్ ఉంటుందని గట్టి సమాచారం. సో రెబల్స్ అయితే అప్పటికి ప్రిపేర్ అవ్వాలని చెప్పాలి. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబాలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.