Acharya Effect On Sarkaru Vaari Paata : గత కొన్నాళ్ల వరకు తెలుగు పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉండేది కానీ ఎప్పుడైతే కొత్త రేట్లు కొత్త జీవో లు అంటూ స్పెషల్ హైక్స్ తీసుకొస్తున్నారో అప్పటి నుంచి పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. బడ్జెట్ పరంగా కొన్ని సినిమాలకి భారీ హైక్స్ ఇచ్చినా ఆ ఎఫెక్ట్ చాలా గట్టిగానే ఉంటుంది.
రాజమౌళి RRR సినిమాకి పెద్దగా కనిపించలేదు కానీ ఇప్పుడు మెగాస్టార్ “ఆచార్య” తో అందరికీ ఒక అంచనా వచ్చేసింది. సినిమా వాళ్ళు దెబ్బ పడడానికి కారణం కేవలం సినిమా టాక్ మాత్రమే కాకుండ టికెట్ ధరలు పెంచివేత కారణంగా కూడా ఆడియెన్స్ లో ఆసక్తి తగ్గిపోతుంది అని ఇతర నిర్మాతలు గ్రహించారు.
ఇప్పుడు అందులో భాగంగానే ఆచార్య ఎఫెక్ట్ తో సర్కారు వారి పాట చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తమ సినిమాకి ఎలాంటి టికెట్ ధరల హైక్ లు వద్దని అనుకుంటున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ సాధారణ ధరలు అయితే ఉన్నాయో వాటితోనే రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారట.
ప్రస్తుతానికి ఈ టాక్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇలా చేస్తే ఎక్కువ మంది ఆడియెన్స్ ని థియేటర్స్ కి తీసుకొచ్చే ప్లాన్ అనే చెప్పాలి. డెఫినెట్ గా సక్సెస్ ఫార్ములా కూడా ఇది అవుతుంది. అనవసరంగా అంతంత పెంచేస్తున్న రేట్లు ఆడియెన్స్ లో మరింత గుబులు పుట్టిస్తున్నాయి ఈ సమయంలో మహేష్ సినిమాకి ఇలా చెయ్యడం సబబే.. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.