ఇండస్ట్రీ టాక్ : ఎన్టీఆర్ ఫ్యాన్ సినిమా కోసం రామ్ చరణ్ రాబోతున్నాడా?

RRR Movie 5 Days World Wide Collection

తెలుగు సినిమా దగ్గర బెస్ట్ ఫ్రెండ్షిప్ సినిమాల్లో ఈ ఏడాది వచ్చిన ట్రిపుల్ ఆర్ (RRR ) సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో రాజమౌళి చేసిన ఈ బిగెస్ట్ బ్రొమాన్స్ చిత్రం భారీ హిట్ అయ్యింది.

అయితే అందులో రామరాజు, భీమ్ ప్రాణ స్నేహితులు అయితే బయట కూడా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు మంచి స్నేహితులు అని ఈ సినిమా తోనే బాగా తెలిసింది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో అయితే ఓ టాక్ వినిపిస్తుంది.

ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ హీరో అయినటువంటి ఓ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అయితే రామ్ చరణ్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఆ హీరో ఎవరో కాదు యంగ్ హీరో విశ్వక్ సేన్ అని టాక్. తాను నటించిన చిత్రం “ఓరి దేవుడా” రిలీజ్ కి రెడీ కాగా ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారు.

మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనితో ఈ కాంబో కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రామ్ చరణ్ హాజరయ్యే ఈవెంట్ కూడా ఇదేనా కాదా అని క్లారిటీ కోసం చూస్తున్నారు.