Sharwanand : ఇండస్ట్రీ టాక్ : శర్వానంద్ ని ఈ సెంటిమెంట్ మాత్రమే కాపాడాలి.!

Sharwanand : ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ హీరోస్ లో అత్యవసరంగా మంచి హిట్ అందుకొని మళ్ళీ తమ కెరీర్ ని గాడిలో పెట్టుకోవాల్సిన వారు కొందరు ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో అయితే మొదటగా హీరో శర్వానంద్ పేరు కూడా ముందు ఉంటుంది. తన లాస్ట్ హిట్ “మహానుభావుడు” తర్వాత చెప్పుకోదగ్గ హాట్ మళ్ళీ తనకి తగల్లేదు.

మధ్యలో వచ్చిన గత చిత్రాలు ‘శ్రీకారం’, ఎన్నో అంచనాలు పెట్టుకొని వచ్చిన “మహా సముద్రం” చిత్రాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. దీనితో తన నెక్స్ట్ సినిమా అయినటువంటి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పై అందరి కళ్ళు పడ్డాయి. దీనితో అయితే శర్వానంద్ హిట్ అందుకొని గాడిలో పడతాడా లేదా అనేది ఆసక్తిగా మారగా..

ఈ సినిమాతో అయితే ఓ సెంటిమెంట్ ప్రకారం తాను ఖచ్చితంగా హిట్ కొట్టాలి అని ఇండస్ట్రీ వర్గపు పెద్దలు జోశ్యం చెబుతున్నారు. ఇదెలా అంటే.. ఈ సినిమా దర్శకుడు తిరుమల కిషోర్ మూలాన అట. ఈ దర్శకుడు చేసిన గత సినిమాలు చూసినట్టు అయితే తాను ఏ హీరోతో అయితే ఫస్ట్ టైం సినిమా చేస్తాడో ఆ హీరోకి మంచి హిట్ అందించాడు.

సాయి తేజ్ తో “చిత్ర లహరి”, రామ్ తో “నేను శైలజ” ఇలా ఆ హీరోతో చేసిన ఫస్ట్ సినిమా డెఫినెట్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు ఈ సెంటిమెంట్ నే శర్వానంద్ ని కాపాడే మాత్రంగా నిలిచింది అని టాక్. మరి ఈ సెంటిమెంట్ తో నిజంగానే శర్వా హిట్ కొడతాడా లేక హ్యాట్రిక్ ప్లాప్ తో నిలిచిపోతాడా అనేది ఇంకొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది.