ఇండస్ట్రీ టాక్ : “గాడ్ ఫాదర్” కి వచ్చే నష్టాలపై అంచనా.!

టాలీవుడ్ సినిమా దగ్గర అప్పుడు కరోనా తర్వాత మళ్ళీ చూడని క్రైసిస్ ఈ ఏడాదిలోనే మళ్ళీ చూసేసారు అనుకున్న కొన్ని సినిమాలు అంత రేంజ్ లో రాణించలేదు. కానీ మళ్ళీ ట్రాక్ లోకి టాలీవుడ్ పడగా ఈ దసరా పండుగ కానుకగా అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వచ్చాయి. ఆ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” కూడా ఒకటి.

దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతుంది. కానీ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో టాక్ మారింది. గాడ్ ఫాదర్ కి ఇప్పుడు నిలకడ వసూళ్లు బాగానే వస్తున్నాయి. అయినా కూడా ఈ చిత్రానికి నష్టాలు తప్పవని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

దీనికి కూడా గట్టి కారణం ఉంది. ఏ పెద్ద హీరో సినిమాకి అయినా ఓపెనింగ్స్ చాలా ముఖ్యం కానీ ఈ చిత్రానికి అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ రాలేదు. అయితే ఆ టికెట్ ధరలతో అవి మంచి ఓపెనింగ్స్ నే కానీ మొదటి వారం టికెట్ ధరలతో అయితే సినిమాకి మొదటి రోజే 20 నుంచి 25 శాతం వసూళ్లు అవుతాయి.

మిగతావి సినిమా టాక్ ని బట్టి ఉంటుంది. ఇక్కడే గాడ్ ఫాదర్ కి దెబ్బ పడింది. సినిమాకి యావరేజ్ ఓపెనింగ్స్ జరిగాయి. కానీ స్టడీగా వసూళ్లు కొనసాగుతున్నాయి. కానీ ఫైనల్ గా జరిగిన 90 కోట్ల మేర బిజినెస్ ని అందుకోవడం చాలా కష్టం అందుకు చాలా పెద్ద లాంగ్ రన్ కావాలి.

కానీ ఇది ఎంత వరకు సాధ్యం అనేది ఆసక్తిగా మారింది. దీనితో ఎలా లేదన్నా గాడ్ ఫాదర్ 15 నుంచి 20 కోట్ల లోపు నష్టాలు మిగిల్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఓవరాల్ గా అయితే గాడ్ ఫాదర్ కి ఏదో మ్యాజిక్ జరగాల్సిందే.