Chiranjeevi Latest Health Update : ఈ కరోనా మూడో వేవ్ లో పెద్ద ఎత్తున సినీ తారలు కరోనా పాజిటివ్ అవుతుండడం వారి అభిమానులను మరింత కలవరపెడుతున్న అంశంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన దక్షిణాదికి చెందిన నటులే ఈసారి పాజిటివ్ వస్తుండడం కాస్త బాధాకరం.
మరి ఇదిలా ఉండగా రీసెంట్ గా తగిలిన మరో బిగ్ షాక్. టాలీవుడ్ సీనియర్ అండ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా పాజిటివ్ అవ్వడం. అయితే ఇక్కడ నుంచి మెగాస్టార్ ఆరోగ్యానికి సంబంధించి ఆ తర్వాత ఎలాంటి అధికారిక సమాచారం కానీ అధికారిక బులెటిన్ లు కానీ వారి కాంపౌండ్ నుంచి విడుదల చెయ్యలేదు.
మరి చిరు ఆరోగ్యం పరిస్థితి ఏమిటి అని చాలా మందికి అనుమానాలు ఉండవచ్చు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో చిరు ప్రస్తుత ఆరోగ్యానికి సంబంధించి ఓ టాక్ అయితే వినిపిస్తుంది. వారి సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారట.
అలాగే కాస్త ఒళ్ళు నొప్పులు, జలుబుతో బాధపడుతున్నారట. ఇక మిగతా అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నారని తెలుస్తుంది. అలానే వారి అపోలో డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు చిరుతో మరియు వారి కుటుంబీకులతో టచ్ లోనే ఉన్నారట. ఇంకా రెండు మూడు వారాల్లో చిరు పూర్తి కోలుకోవచ్చి వారు చెబుతున్న లాస్ట్ మాట.