Bheemla Nayak : ఇండస్ట్రీ టాక్ : “భీమ్లా” విడుదల సంక్రాంతికే అట.. కీలక ట్విస్ట్ ఎలాగంటే?

Bheemla Nayak : గత కొన్ని రోజులు వరకు టాలీవుడ్ సినిమా దగ్గర అనేక ఊహించని మలుపులు వచ్చాయి. భారీ సినిమా ట్రిపుల్ ఆర్”RRR” సంక్రాంతి విడుదలకు రావడంతో సూపర్ స్టార్ బాబు సినిమా సర్కారు వారి పాట ఆల్రెడీ వాయిదా చేసుకోగా ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకొని ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా “భీమ్లా నాయక్” మాత్రం లాస్ట్ మినిట్ వరకు కూడా హోల్డ్ లోనే ఉన్నాడు.

దీనితో టాలీవుడ్ బడా నిర్మాతలు కూడా అంతా రంగం లోకి దిగి భీమ్లా నాయక్ ని ఎలాగో రిలీజ్ వాయిదా వేసేలా చేశారు. కానీ ఇప్పుడు ఏ సినిమా వల్ల అయితే భీమ్లా నాయక్ ని ఆపుకున్నారో ఇప్పుడు ఇదే సినిమా ఆగిపోవడంతో మళ్లీ భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా ఇంకా ఒక్క సాంగ్ బాలన్స్ ఉండగా ఈ సాంగ్ ని మాత్రం తీసేసి సినిమాని రిలీజ్ చేసేయాలని చూస్తున్నారట. దీనితో భీమ్లా నాయక్ సినిమా జనవరి 12న కానీ 13 లేదా 14 తారీఖుల్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. మరి దర్శకుడు సాగర్ చంద్ర, త్రివిక్రమ్ నిర్మాత నాగవంశీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో అనేది రసవత్తరంగా మారింది.