Bheemla Nayak : ఇండస్ట్రీ టాక్ : “భీమ్లా నాయక్” క్లైమాక్స్ ని మామూలుగా ప్లాన్ చెయ్యట్లేదట.!

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో “భీమ్లా నాయక్” కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని చిత్ర బృందం జనవరి రేస్ నుంచి ఫిబ్రవరికి ఇటీవలే షిఫ్ట్ కూడా చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో క్లైమాక్స్ పై ఇప్పుడు ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ ని చిత్ర బృందం వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని చూడని రేంజ్ మాస్ విశ్వరూపంలో ఆడియెన్స్ చూడబోతున్నారట.

అంత పవర్ ఫుల్ గా ఈ క్లైమాక్స్ ని తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ పూనకాలు ఇచ్చే క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రంలో నిత్య మీనన్, అలాగే సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా నాగవంశీ నిర్మాణం అందిస్తున్నారు.