Mahesh Babu : ఇండస్ట్రీ టాక్ : ఇప్పుడు మహేష్ కి మెగాస్టార్ తన వంతు సాయం అట.!

Mahesh Babu : తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర స్టార్ హీరోలు ఎప్పుడు బాగానే కలిసి ఉంటారు కానీ వారి అభిమానులు మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు. ఎన్నో మార్లు ఒక హీరో కోసం ఇంకో హీరో రావడం తన వంతు మరో సినిమాకి ఏదొక పని చెయ్యడం వంటివి జరిగాయి. అలాగే ఈసారి కూడా ఇలాంటి వాతావరణం మన తెలుగు సినిమా దగ్గర కనిపిస్తుంది.
అయితే ఇలాంటి విషయాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుగానే  అందిస్తుంటాడు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం “ఆచార్య” కి కూడా దర్శకుడు కొరటాల శివ కోరిక మేరకు వెంటనే వాయిస్ ఓవర్ అందించాడు.
ఇది విన్నాక మెగాస్టార్ మరియు రామ్ చరణ్ లు మైమరచి మహేష్ కి థాంక్స్ చెప్పారు. ఇక మహేష్ నుంచి ఆ సాయం అందుకున్న చిరు ఇప్పుడు తన వంతు సాయం మహేష్ సినిమాకి ఇవ్వడానికి సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.
మహేష్ బాబు నటించినటువంటి లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట తాలూకా ట్రైలర్ ని ఆచార్య సినిమాతో అటాచ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేశారట. దీనితో ఈ బిగ్ ట్రీట్ ఆచార్య నుంచి ఇవ్వనున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. అలాగే ఆల్రెడీ ఈ ట్రైలర్ రేపే రిలీజ్ అవ్వొచ్చని గాసిప్స్ ఉన్నాయి అందుకే 29న వచ్చే సినిమాతో ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్.