Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. dvv ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమా దర్శకుడు రాజమౌళి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు.
ఒక్కసారి కొన్ని ఊహించని పరిణామాల వల్ల మనం అనుకున్నది చేయలేక దానిని వాయిదా వేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాజమౌళికి ఎదురయ్యింది. రాజమౌళి చేసిన పని వల్ల ఇండస్ట్రీ పెద్దలు అందరూ రాజమౌళిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాన్ ఇండియా మూవీ
ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఇప్పటికే నిర్మాణ పనులు అన్ని పూర్తి చేసుకుని ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఏడు భాషలలో విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్ కోసం సినిమా నుండి వేగంగా అన్ని అప్డేట్స్ వదులుతున్నారు. జక్కన్న ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా త్రీడీలో కూడా విడుదల చేస్తున్నారు.
అయితే అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం విడుదల వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈనెల 7వ తేదీన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కావలసి ఉంది. మా సినిమా వాయిదా వేయవలసి వచ్చింది. ఈ తరుణంలో రాజమౌళిపై ఇండస్ట్రీ పెద్దలు అందరూ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఈ సినిమా నాలుగు సార్లు వాయిదా పడిందని , ఈనెల 7వ తేదీన సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా మళ్లీ వాయిదా వేశారు. ఈ సంక్రాంతికి చాలామంది తమ సినిమాలను విడుదల చేయవలసి ఉండగా రాజమౌళి కోసం వాటిని తప్పించి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు దారి కల్పించారు. దాంతో నార్త్ ఇండస్ట్రీ సంగతి ఎలా ఉన్నా తెలుగు తమిళం సినీ పరిశ్రమ నిర్మాతలు మాత్రం రాజమౌళి మీద మండిపడుతున్నారు. రాజమౌళి ఎల్లప్పుడూ తన సినిమా కలెక్షన్స్ , లాభాలు గురించే ఆలోచిస్తున్నారు తప్ప మిగిలిన సినిమాల గురించి ఆలోచన చెయ్యడం లేదని సినీ పెద్దలు మండిపడుతున్నారు.