Megatsar Movie : ఇండస్ట్రీ బజ్ : మెగాస్టార్ సినిమాలో రవితేజ పాత్రపై కీలక సమాచారం మీకోసం.!

Megatsar Movie : ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “ఆచార్య” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం లైన్ లో ఉండగానే చిరు మరిన్ని ఆసక్తికర సినిమాలు చెయ్యడానికి ఓకే చేశారు. మరి వాటిలో రెండు రీమేక్ సినిమాలు కాగా ఒకటి డైరెక్ట్ ప్రాజెక్ట్ ఉంది. అయితే ఆ డైరెక్ట్ సినిమా పైనే ఎనలేని హైప్ కూడా నెలకొంది.

మరి ఈ సినిమాని దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపైనే ఒక ఆసక్తికర బజ్ సినీ వర్గాల్లో ఇపుడు బయటకి వచ్చింది. ఈ సినిమాలో గత కొన్ని రోజులు నుంచి మరో మాస్ హీరో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తాడని టాక్ ఉంది. అయితే ఈ వార్త నిజమే అన్నట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా రవితేజ చేయబోయే ఈ పాత్రపై కీలక సమాచారం కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఈ చిత్రంలో రవితేజ పాత్ర సుమారు 40 నిముషాలు ఉంటుందట. అంటే ఓ రకంగా ఇది కూడా మల్టీ స్టారర్ సినిమానే అని చెప్పాలి. అలాగే ఈ సినిమాని దర్శకుడు ఆసక్తికర బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేస్తుండగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి మాత్రం మళ్ళీ పాత రోజులు గుర్తు చేసే ట్రీట్ ని ఇస్తానని చెబుతున్నాడు.