RRR Movie : ఇండస్ట్రీ బజ్ : అవైటెడ్ “RRR” కి ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిన డేట్ ఇదేనట!

RRR Movie :  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. దీనితో అభిమానులు సహా పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరి అన్నీ బాగుండి ఉంటే ఈపాటికే “నాన్ RRR” రికార్డ్స్ అనే ట్యాగ్ కూడా జోరుగా వైరల్ అయ్యేది కానీ కరోనా వచ్చి మొత్తం పరిస్థితులనే మార్చివేసింది. ఎలాగో ఈ జనవరిలో రిలీజ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ సినిమా దూరం వెళ్ళిపోయింది. దీనితో ఈ చిత్రం రిలీజ్ డేట్ అందని ద్రాక్ష గానే మిగలగా సినీ వర్గాల్లో ఓ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

మేకర్స్ అయితే ఇప్పుడు ఆల్ మోస్ట్ ఓ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారట. మరి దీని ప్రకారం వచ్చే ఏప్రిల్ 29 నాటికి అయితే సినిమా రిలీజ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుందని అనుకుంటున్నారట. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ నటించగా డీవీవీ దానయ్య భారీ ఖర్చు తో నిర్మాణం వహించారు.