ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా “RRR” ట్రైలర్ కి డేట్ ఫిక్స్..సిద్ధం కండి.!

 
ఇండియన్ సినిమా దగ్గరే మంచి మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). రౌద్రం రణం రుధిరం సినిమా ను దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తీసాడు. మరి ఎనలేని అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచే మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని ఈ డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేస్తామని చిత్ర బృందం చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడు దీని డేట్ ని రివీల్ చేసేసారు. ఇండియన్ బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా అయ్యినటువంటి ఈ సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి బాహుబలి లాంటి సినిమా తరువాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ విజువల్ ట్రీట్ ఎలా ఉంటుందో చూడటానికి దేశం అంతా సిద్ధంగా ఉంది.