మీకు పాస్ పోర్టు ఉందా. అయితే మీకో శుభవార్త. వీసా అవసరం లేకుండా ఈ 16 దేశాలను విజిట్ చేయొచ్చు. భారత పాస్ పోర్టు ఒక్కటి ఉంటే చాలు. 16 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీకి సంబంధించి అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి మురళీధరన్ తెలిపారు.
వీసా లేకుండా 16 దేశాలకు వెళ్లడంతో పాటుగా.. వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని 43 దేశాలు కల్పిస్తున్నాయి. అంటే.. ఇండియాలో వీసా లేకున్నా.. ఆ దేశానికి వెళ్లాక వీసా తీసుకోవచ్చన్నమాట. అలాగే మరో 36 దేశాలు ఈ వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
వీసా లేకున్నా పాస్ట్ పోర్టు వెళ్లగలిగే దేశాలు ఇవే
వీసా ఫ్రీ ఎంట్రీ దేశాలు.. బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంకాంగ్, మాల్దీవులు, మారిషస్, మోంట్సెరాట్, నేపాల్, నియు ద్వీపం, సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్, సమోవా, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్, టొబాగో ఉన్నాయి.
వీసా ఆన్ అరైవల్ ఫెసిలిటీని కల్పిస్తున్న 43 దేశాల్లో… ఇరాన్, ఇండోనేషియా, మయమ్మార్ లాంటి దేశాలు ఉన్నాయి.
ఈ వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్న 36 దేశాల్లో న్యూజిలాండ్, శ్రీలంక, మలేషియా ఉన్నాయి. అలాగే… భారతదేశం నుంచి అంతర్జాతయ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు వీసా ఫ్రీ ఎంట్రీ దేశాల సంఖ్యను భవిష్యత్తులో మరింత పెంచనున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.