భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 36 పరుగులు మాత్రమే చేసి, ఆలౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244, ఆస్ట్రేలియా 191 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గెలవాలంటే రెండో ఇన్సింగ్స్‌లో 90 పరుగులు మాత్రమే చేస్తే సరిపోతుంది.
ఓవర్‌నైట్ స్కోరు 9/1తో ఆరంభించిన మెన్ ఇన్ బ్లూ.. మరో 27 రన్స్ జోడించి 8 వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్ మహ్మద్ షమి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. టీమిండియా టెస్టు చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఇదే తక్కువ స్కోరు.
ఇంతకుముందు ఇంగ్లండ్ పై 1974లో 42 రన్స్‌కు టీమిండియా ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల పై 58 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఇక అన్ని దేశాల విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 1955లో 26 రన్స్‌కే ఆలౌటైంది. సౌతాఫ్రికా 30 రన్స్‌కు రెండు సార్లు ఆలౌట్ అయ్యింది. 36 రన్స్‌కు ఆలౌట్ అయిన హిస్టరీ, సౌతాఫ్రికాతోపాటు ఆస్ట్రేలియా పేరిట ఉంది.