రిటైర్మెంట్‌ ప్రకటించిన పార్థివ్‌ పటేల్‌ !

టీమిండియా వికెట్ కీప‌ర్ పార్థివ్ ప‌టేల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. పార్థివ్ టీమిండియా తరుపున ఇప్పటివరకు 25 టెస్టులు, 38 వ‌న్డేలు, 2 టీ20లు ఆడాడు. బుధ‌వారం ట్విట‌ర్ వేదిక‌గా త‌న రిటైర్మెంట్ విష‌యాన్ని ప్రకటించాడు. గుజ‌రాత్ తరుపున రంజీ ట్రోఫీలో 194 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పార్ధివ్ జాతీయ జట్టులోకి అరగ్రేటం చేశారు.

Image

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికిన 35 ఏళ్ల పార్థివ్ 2002లో తొలిసారి ఇండియ‌న్ టీమ్‌తో అడుగుపెట్టారు. ఇలా 18 ఏళ్లు తన కెరీర్‌కు సహాకరించిన బీసీసీఐ, అంద‌రు కెప్టెన్లకు కృత‌జ్ఞత‌లు చెప్పారు. టెస్టు క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో( 17 సంవత్సరాల 153 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా పార్థివ్‌ అప్పట్లో రికార్డు సృష్టించాడు. ఆరంభంలో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా అదే ప్రదర్శను చూపించలేకపోయాడు.

అదే సమయంలో దినేష్‌ కార్తిక్‌, ఎంఎస్‌ ధోనిలు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడంతో పార్థివ్‌ కెరీర్‌ డౌన్‌ఫాల్‌ మొదలైంది. ముఖ్యంగా ధోని అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా మారిన తర్వాత పార్థివ్‌కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక పార్థివ్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా.. 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ త‌ర‌ఫున ఆడుతున్నాడు.