Pushpa Crazy Dialogue  : “పుష్ప” మాస్ క్రేజ్..ఇండియన్ లెజెండరీ నటుడు డైలాగ్ వైరల్.!

Pushpa Crazy Dialogue  : టాలీవుడ్ నుంచి ఎల్లలు దాటి ఇప్పుడు ఒక్కో సినిమా ఏ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చూస్తున్నాము. మరి అలా ఇండియన్ సినిమా దగ్గర సునామి లాంటి క్రేజ్ మరియు రీచ్ తో అదరగొట్టిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “పుష్ప” అని చెప్పాలి. దర్శకుడు సుకుమార్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబోలో వచ్చిన ఈ సినిమా నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా కనీ వినీ ఎరుగని రీతి రీచ్ ని తెచ్చుకుంది.
ఇక ఈ సినిమాలో హైలైట్ అయ్యిన ఎన్నో అంశాల్లో ఇంటర్వల్ బ్యాంగ్ దగ్గర అల్లు అర్జున్ “పుష్ప అంటే ఫైర్” అని చెప్పిన డైలాగ్ సెన్సేషన్ అయ్యింది. దీనిని లేటెస్ట్ గా మన ఇండియన్ సినిమా దగ్గర లెజెండ్ అయినటువంటి బాలీవుడ్ స్టార్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ చెప్పడం ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది.
తన గ్రాండ్ రియాలిటీ షోలో ప్రశ్న భాగంగా అమితాబ్ చెప్పిన ఈ డైలాగ్ తో ఈ సినిమాకి ఏ లెవెల్ క్రేజ్ వచ్చిందో అర్ధం చేసుకోవాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతుండగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తూ అమితాబ్ బచ్చన్ కి ధన్యవాదాలు తెలిపారు.
మరి ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ సంగీతం ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఫహద్ ఫాజిల్ మరియు అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
https://twitter.com/MythriOfficial/status/1517926867483119616