KGF Chapter 2 : బాక్సాఫీస్ రిపోర్ట్ : అక్కడ మాత్రం వసూళ్ళలో తగ్గనంటున్న “RRR”, “కేజీఎఫ్ 2” సినిమాలు.!

KGF Chapter 2 :  ఈ ఏడాదికి ఇక బిగ్గెస్ట్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ చేసిన సినిమాలు ఏవన్నా ఉన్నాయి అంటే అంటే అవి మన సౌత్ నుంచి వచ్చిన భారీ సినిమాలు ట్రిపుల్ ఆర్(RRR) మరియు కన్నడ సెన్సేషనల్ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలు అనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ప్రతి చోట దుమ్ము లేపుతున్నాయి.
అయితే వీటికి ఏంతో కీలకమైనటువంటి హిందీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించని రేంజ్ పెర్ఫార్మన్స్ ని ఈ సినిమాలు కనబరుస్తుండడం తో ట్రేడ్ వర్గాల వారు షాక్ అవుతున్నారు.
హిందీలో నిజానికి RRR సినిమా కేజీఎఫ్ తో పోలిస్తే కాస్త తక్కువ వసూళ్ళ నే అందుకుంటున్నా వాటిని స్టడీ గా కొనసాగిస్తుండడం గమనార్హం. మరి లేటెస్ట్ గా ఈ సినిమా అక్కడ గత ఆదివారం 3.3 కోట్ల వసూళ్లను అందుకోగా అక్కడ ఇప్పటి వరకు ఈ సినిమా 253.3 కోట్లు వసూలు చేసినట్లు అయ్యింది. ఇక కేజీఎఫ్ 2 విషయం చూస్తే ఇది ఏకంగా సునామి అని చెప్పాల్సిందే.
అక్కడ ఈ సినిమా అయితే కేవలం 4 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ని కొల్లగొట్టేసి హిందీలో ఆల్ టైం రికార్డ్ సెట్ చేస్తుంది.
మరి నిన్న ఆదివారం అక్కడ కేజీఎఫ్ సినిమా 50.3 కోట్లు నెట్ వసూళ్లు అందుకోగా దీనికి దగ్గరదగ్గరా 200 కోట్లు ఈ సినిమా రాబట్టేసి ట్రేడ్ పండితులుని ఆశ్చర్య చకితులను చేస్తోంది. మొత్తానికి ఇలా ఈ రెండు భారీ సినిమాలు దేనికదే తగ్గకుండా పెర్ఫార్మన్స్ చేస్తున్నాయి.
ఇక రాజమౌళి సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ప్రశాంత్ నీల్ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ బాస్ హీరోగా నటించాడు.