Pushpa : లాస్ట్ చేసి “పుష్ప”కి గట్టి దెబ్బ..ఇలాగైతే కష్టమే.!

Pushpa : స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా నిలబెట్టేలా ఉంటుందని పుష్ప కోసం దర్శకుడు సుకుమార్ ఏదో సినిమా ఫంక్షన్ లో చెప్పారు. అక్కడ నుంచి అందరు కూడా ఐకాన్ స్టార్ అనే అల్లు అర్జున్ ని పిలవడం స్టార్ట్ చేశారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పుష్ప ఖచ్చితంగా అందరి అంచనాలు అందుకునేదిలా ముఖ్యంగా పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులని మెప్పించేదిలా ఉంటుందని ఆ రేంజ్ లో అల్లు అర్జున్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఏవేవో వినిపించాయి.

కానీ ఇక్కడ అనూహ్యమైన విషయం ఏమిటంటే సినిమా ట్రైలర్ తర్వాత సినిమా తేలిపోయింది. అప్పటి వరకు మంచి అంచనాలు పెట్టుకున్న వారిని అంతా అల్లు అర్జున్ అయితే మెప్పించగలిగాడు కానీ సినిమాలో సుకుమార్ తీసుకున్న కంటెంట్ ఇంప్రెస్ చెయ్యలేదు. కేజీఎఫ్ కి దగ్గర లైన్ లోనే సినిమా ఉండడంతో ఈ సినిమాపై ఆసక్తి చాలా తగ్గిపోయింది.

పైగా ఈ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తుండగా అందులో హిందీ మరియు ఇంకొన్ని సౌత్ భాషలకి స్వయంగా అల్లు అర్జున్ నే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు అనేది ఆసక్తిగా మారగా ఇక్కడ కూడా నిరాశ తప్పలేదు. దీనితో లాస్ట్ చేసి ఈ సినిమాపై మినిమమ్ అంచనాలు పెట్టుకున్న వారిలో ఆసక్తి తగ్గిపోయింది.

అయితే సుకుమార్ టేకింగ్ పై మాత్రం ఇంకా చాలా వరకు నమ్మకంగా ఉన్నారు ఖచ్చితంగా ఏదొక మ్యాజిక్ చేస్తాడని అంతా నమ్ముతున్నారు. మరి ఫైనల్ గా ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. మరి ఒకవేళ కానీ సుకుమార్ కూడా చూసిందే తీస్తే పాన్ ఇండియా లెవెల్లో కష్టమే అని చెప్పాలి.