RRR : ఇక ఈ నెక్స్ట్ వీక్ నుంచి మన ఇండియన్ సినిమా దగ్గర భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాల పరంపర మొదలు కానుంది. మరి దీనిని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన “రాధే శ్యామ్” తో మొదలు పెట్టనుండగా దాని తర్వాత మరో భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కొన్ని రోజుల్లోనే రిలీజ్ కానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోలతో ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళి తీసిన ఈ బిగ్గెస్ట్ ఏక్షన్ థ్రిల్లర్ సినిమాపై అనేక స్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాపై ఉన్న క్రేజ్ నిమిత్తమే భారీ స్థాయి బిజినెస్ అన్ని భాషల్లో కూడా ఈ సినిమా జరుపుకుంది.
అయితే మన తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమా వస్తుంది అంటే దానికి హిందీ మార్కెట్ ఎంతో కీలకం. ఇప్పుడు దీనిపైనే ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. హిందీలో ఈ సినిమా భారీ సినిమాల నిర్మాణ సంస్థ అయినటువంటి పెన్ స్టూడియోస్ వాళ్ళు కొనుగోలు చేశారు.
కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో వారు ఈ సినిమాని రిలీజ్ చేయట్లేదట. మరి దీనికి కారణం ఏమిటో తెలీదు కానీ లాస్ట్ మినిట్ అయితే ఇప్పుడు తమ సినిమాని హిందీలో తామే రిలీజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది అని టాక్. ఇది బిగ్ బ్లో అనే చెప్పాలి. అయినా కూడా రాజమౌళికి అయితే తన సినిమాని ప్రమోట్ చేసుకునే సత్తా ఉంది పైగా హిందీలో ఈ సినిమాపై మంచి క్రేజ్ కూడా ఉంది. మరి వేచి చూడాలి ఈ సినిమా పట్ల ఏం జరుగుతుంది అనేది.