మెగాస్టార్ చిరంజీవి ఇండియాలో పరిచయం అక్కరలేని పేరు. మూవీ ఇండస్ట్రీలో ఆయన అధిరోహించిన శిఖరాలు సాధారణ మానవుడికి అసాధ్యం అనిపించేలా ఉంటాయి. ఒక జనరేషన్ సినీ అభిమానులకు ఆయన ఒక దేవుడు. ఆయన చేసిన డాన్స్, నటన, ఫైట్స్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసివి. ఆయన డాన్స్ ఇండస్ట్రీని ఎంతలా ప్రభావితం చేసిందంటే నటుడు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి డాన్స్ ఖచ్చితంగా రావాలనే రేంజ్ లో ప్రభావితం చేశారు. మొన్న 22న ఆయన పుట్టిన రోజు సంధర్బంగా ఆయన నటిస్తున్న 152వ మూవీ యొక్క మోషన్ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఈ మూవీని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఆచార్య అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీపై వివాదం మొదలైంది.
మూవీ పోస్టర్ లో కనిపిస్తున్న ధర్మస్థలి అనే పాయింట్ ను తన స్టోరీ పుణ్యభూమి నుండి కాపీ కొట్టారని, తాను ఈ పుణ్యభూమి స్క్రిప్ట్ ను 2006లో రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేశానని, ఆచార్య మూవీ యూనిట్ తన స్క్రిప్ట్ ను కాపీ చేశారని అనిల్ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు. అయితే కేవలం మూవీ పోస్టర్ ను మాత్రమే చూసి కాపీ కొట్టారని చెప్పడం తగదని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే శ్రీమంతుడు మూవీ అప్పుడు కూడా కొరటాల శివ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే మూవీ రిలీస్ అయిన తరువాత ఆ ఆరోపణల్లో నిజం లేదని తెల్సింది. అయితే ఇప్పుడు అనిల్ చేసిన వ్యాఖ్యలపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళ్తుందో వేచి చూడాలి. ఒకవేళ మూవీ యూనిట్ స్పందించకపోతే అనిల్ కోర్ట్ లో కేసు వేసే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.