Senior Heroine Gouthami : ఒకప్పుడు ఐటెం సాంగ్స్ కోసం జ్యోతిలక్ష్మి, సిల్క్‌స్మిత ఇలా.. సెపరేటుగా ఐటెం గాళ్స్ వుండేవారు. వీళ్లని ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా తీసుకునేవారు. కానీ, ఇప్పుడా ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్లే ఒకడుగు ముందుకేసి, మేమేం ఐటెం సాంగ్స్‌కి తక్కువ కాదంటూ.. జోరు ప్రదర్శిస్తున్నారు.
ఆ ట్రెండే లేని కాలంలో ఓ సీనియర్ హీరోయిన్ ఐటెం సాంగ్‌లో నటించి, ట్రెండ్ సృస్టించింది. ఆమె ఎవరో కాదు, సీనియర్ భామ గౌతమి.
ఆమె నటించిన స్పెషల్ సాంగ్ ఏంటంటే, ‘చికుబుకు చికుబుకు రైలే..’ పాట. శంకర్ దర్శకత్వంలో వచ్చి, సంచలన విజయాన్ని అందుకున్న ‘జెంటిల్‌మెన్’ సినిమాలోనిది ఈ సాంగ్. ఈ సాంగ్‌కి చాలా చాలా ప్రత్యేకతలున్నాయ్.
డైరెక్టర్‌గా ఈ సినిమా శంకర్‌కి తొలి సినిమా కావడంతో పాటు, ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పిలుచుకునే ప్రభుదేవాకి కొరియోగ్రాఫర్‌గా తొలి సాంగ్ కూడా ఇదే కావడం విశేషం. తండ్రి సుందరం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ప్రభుదేవా ఈ సాంగ్‌తోనే కొరియోగ్రఫర్ అవతారమెత్తారు.
అంతేకాదు, ఈ సాంగ్‌లో గౌతమి నటిస్తే బావుంటుందని సుందరం మాస్టరే సలహా ఇచ్చారట. అయితే, అప్పటికే పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన గౌతమి మొదట్లో అభ్యంతరం చెప్పిందట.
కానీ, డైరెక్టర్ కాకముందే శంకర్‌తో మంచి స్నేహం వుండడం, సుందరం మాస్టర్ కొరియోగ్రఫీలో పలు పాటలకు గౌతమి డాన్సులు చేయడం వల్ల ఈ పాటలో నటించేందుకు ఒప్పుకుందట.
అయితే, ఈ పాటని ఐటెం సాంగ్‌లా కాకుండా స్పెషల్ సాంగ్‌లా చిత్రీకరిస్తామని గౌతమికి ముందే మాటిచ్చాడట ప్రభుదేవా. అలా ఐటెం సాంగ్స్‌లో హీరోయిన్స్ నటించే ట్రెండ్ సీనియర్ భామ గౌతమి అప్పుడే సెట్ చేసిందన్నమాట.