దంతాలు గార పట్టి పసుపు రంగులో కనిపిస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?

దంతాలు గార పట్టి పసుపు రంగులో మారడం వల్ల నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడడానికి, కలవడానికి సంకోచిస్తుంటారు. దంతాలు పసుపు రంగులో మారడానికి అనేక కారణాలు ఉన్నాయి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సంపూర్ణ పోషకాలు లోపించడం, అధిక ఫ్లోరైడ్ ఉన్న నీళ్లను తాగడం, ప్రతిరోజు సరైన పద్ధతిలో దంతాలను శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాలతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కారణం కావచ్చు. మన దంతాలపై తగినంత శ్రద్ధ చూపకపోతే భవిష్యత్తులో తీవ్రమైన దంత సమస్యలు తలెత్తవచ్చు. దాంతో నోట్లో ప్రమాదకర బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో ప్రవేశించి దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.

ముఖ్యంగా దంతాలను ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. అధిక పని ఒత్తిడి కారణంగా నిర్లక్ష్యం చేస్తే పళ్ళపై గార లాంటి పదార్థం చేరుకుపోయి దంతాలు పసుపు రంగులో మారడమే కాకుండా మన నోట్లో ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ అభివృద్ధి చెందడానికి కారణం అయ్యి నోటి నుంచి దుర్వాసన, చిగుళ్లలో రక్తం కారణం, దంతాలు ఊడిపోవడం, దంతాలు క్షీణించడం అంటే అనేక సమస్యలు తలెత్తుతాయి. కావున ఇలాంటి సమస్యలను అధిగమించడానికి పళ్ళపై ఉండే కారణం సహజ పద్ధతిలో ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు, ఆవనూనె, ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను దృఢంగా ఆరోగ్యంగా ఉండునట్లు చూసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒకటి స్పూన్ గోరువెచ్చని ఆవనూనెలో చిటికెడు పసుపును, చిటికెడు ఉప్పును బాగా మిక్స్ చేయాలి ఈ మెత్తటి మిశ్రమంలో క్యారెట్ రసాన్ని కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొన్ని వారాలపాటు వాళ్లపై మర్దన చేసుకుంటే ఎన్నో ఏళ్లుగా మన దంతాలపై పేరుకుపోయిన గార వంటి పదార్థం తొలగిపోయి దంతాలు తెల్లగా దృఢంగా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. ఈ మిశ్రమంలో పుష్కలంగా ఉన్న యాంటీ మైక్రోవేల్ గుణాలు నోటి దుర్వాసనను చిగుళ్ల సమస్యలను కూడా నివారిస్తుంది.