బిగ్ బాస్ ఒక్కో ఎపిసోడ్ కోసం నాగ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోవాల్సిందే?

బుల్లితెరపై మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రారంభం కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఎంతో ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కాబోతుందని సమాచారం. ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం అయితే కంటెస్టెంట్లను ఆగస్టు చివరి వారంలో క్వారంటైన్ పంపిస్తున్నట్లు సమాచారం.ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా ఆ విషయం అర్థమైంది. ఈ క్రమంలోనే నాగార్జున తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. నాగార్జున గత ఎపిసోడ్లకు 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ కార్యక్రమం కోసం ఒక వారానికి అంటే రెండు ఎపిసోడ్లకుగాను నాగార్జున 14 నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ విషయం గురించి అధికారక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమం సీజన్ 3నుంచి నాగార్జున వ్యాకతగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ సీజన్ కి మాత్రం నాగార్జునకు బదులు సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా క్లారిటీ వచ్చింది.