రామ్ చరణ్ ధరించిన డెనిమ్ జాకెట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… ఎన్ని లక్షలు తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇలా ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన 10వ వివాహ వార్షికోత్సవ దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం ఇటలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా ఇటలీలో ఎంతో ఎంజాయ్ చేసిన ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

వీరి ఇటలీ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వివాహం రోజు ఈ దంపతులు వేసుకున్న డ్రెస్ ల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పెళ్లిరోజు ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు 2,23,049 రూపాయలని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే రూ.1,13,000 అని టాక్‌.. ఇకపోతే తాజాగా ఇటలీ నుంచి తిరిగి పయనమైన వీరిద్దరూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ రా అని రాసివున్న డెనిమ్ జాకెట్ ధరించారు.అయితే ఈ జాకెట్ ధర ఎంత ఉంటుందని నెటిజన్లు పెద్ద ఎత్తున దీని ధర కోసం సెర్చ్ చేయగా దీని ధర చూసి ఒక్క సారిగా నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ డెనిమ్ జాకెట్ ధర ఏకంగా రెండు లక్షలకు పైగా ధర ఉండటంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో అయిన తర్వాత పూర్తిగా హై ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.