రావు రమేష్ ఒక భారతీయ నటుడిగా అందరికీ సుపరిచితుడే. ఈయన ప్రఖ్యాత నటుడు అయినా రావు గోపాలరావు, హరికథ కళాకారిణి అయినా కమల కుమారి దంపతులకు 1970లో శ్రీకాకుళంలో జన్మించాడు. తన విద్యాభ్యాసం అంత చెన్నైలో జరిగింది. తను ప్రసిద్ధ స్టీల్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు. కానీ అనుకోకుండా సినిమాలలోకి రావాల్సి వచ్చింది. రావు రమేష్ కు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం.
తల్లి ప్రోత్సాహంతో సినిమాల వైపు దృష్టి పెట్టాడు. బాలకృష్ణ నటించిన సీమ సింహం సినిమాలో సిమ్రాన్ కు సోదరినిగా ఒక చిన్న పాత్ర లో అవకాశం వచ్చింది. తరువాత అవకాశాలు రాలేదు. తిరిగి చెన్నై వెళ్ళిపోయి టీవీ ధారవాహికలు అయినా పవిత్ర బంధం, కలవరి కోడలు నటించాడు.
తరువాత తెలుగులో 2007లో ఒక్కడున్నాడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. తరువాత వచ్చిన గమ్యం సినిమాలో నక్సలైట్ పాత్ర వేసి మెప్పించారు. 2008 లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమా లో లెక్చరర్ గా ఎంట్రీ ఇచ్చి తన నాన్నకు తగ్గ గౌరవం గొప్ప పేరు పరీక్షలు సంపాదించారు. ఆ తర్వాత వచ్చిన ఆవకాయ బిర్యాని, ఫిట్టింగ్ మాస్టర్ లలో నటించిన అంత ప్రాముఖ్యత రాలేదు.
మగధీరలో బోరా పాత్రలో నటించారు. చాలామందికి తెలియదు ఆ పాత్రలో ఉన్నది రావు రమేష్ అని. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ తన తండ్రి నటనకు ఏమాత్రం చెడ్డ పేరు రాకుండా వారసత్వం అందిపుచ్చుకునే విధంగా పలు సినిమాలలో నటించి గొప్ప పేరు పొందారు. తనకంటూ సపరేట్గా పేరు క్రియేట్ చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో రావు రమేష్.
ఒకప్పుడు ఆయన పుట్టగొడుగుల వ్యాపారం చేద్దామని వ్యవసాయంలో అడుగు పెట్టారు 1995లో ప్రారంభించిన పుట్టగొడుగుల వ్యాపారం నష్టం వచ్చి కనీసం పెట్టుబడి కూడా రాలేదు. సినిమాలలోనే రాణించాలని భావించారు. ఈయన రోజుకు 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ప్రస్తుతం సినిమా బడ్జెట్ను బట్టి కోటి నుండి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఈయన పల్లి సంస్థల్లో యాడ్స్ కూడా చేస్తూ ఒక్కో యాడుకు పోటి నుండి కోటి 50 లక్షల వరకు చార్జ్ చేస్తారట.
ఈయనకు కార్లు, వాచీలు అంటే చాలా ఇష్టం. దాదాపు 5 కార్లు ఉన్నాయని సమాచారం. హైదరాబాద్ శ్రీకాకుళం చెన్నైలో నివాసాలు,పలు కమర్షియల్ కాంప్లెక్స్ లు, కొన్ని వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయని సమాచారం. మొత్తంగా 50 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని సమాచారం.