మధ్యలో ‘కిల్లర్’, ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’, ‘అల్లరి అల్లుడు’ లాంటి సూపర్ హిట్స్ వచ్చినా కూడా భారీ హిట్ మాత్రం రాలేదు. ముఖ్యంగా నాగర్జున నటించిన సినిమాల్లో బెస్ట్ అనిపించుకునే సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి. అలాంటి వాటిలో
హలో బ్రదర్’ మూవీ ఒకటి అనే చెప్పవచ్చు. మొదటిసారి ఈ మూవీ లో నాగార్జున డబుల్ రోల్ లో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 20,1994లో ఈ చిత్రం విడుదలైంది. దీనిని రూ.2.50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
నాగార్జున సినీ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచిన సినిమాల్లో హలో బ్రదర్ ఒకటి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 120 షోలు హౌస్‌పుల్‌గా ఆడి రికార్డుల మోత మోగించింది. 30 కేంద్రాల్లో 50 రోజులు, 20 కేంద్రాల్లో 100 రోజులు నడిచి రికార్డు సృష్టించింది. మొత్తానికి రూ.15.25 కోట్ల గ్రాస్‌ను సాధించింది. రూ.8.0 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. నాగార్జున కెరీర్‌లోనే ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు.