ఉపాసనా వార్షిక ఆదాయం ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే… ఎన్ని కోట్లో తెలుసా?

ఉపాసన కొణిదెల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా, మెగా కోడలిగా ఎంతో చక్కగా బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నారు.ఇక ఈమె ఒకవైపు మెగా ఇంటి బాధ్యతలతో పాటు అపోలో హాస్పిటల్ వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.అలాగే సామాజిక అంశాలపై కూడా ఎంతో చలాకీగా ఉండే ఉపాసన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇలా వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉండే ఉపాసన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మందికి ఎన్నో ఆరోగ్య సూచనలు చేస్తూ సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక మూగజీవాలను దత్తత తీసుకోవడం వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టడమే కాకుండా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ వైద్య సేవలను అందిస్తూ, వృద్ధాశ్రమాలకు సహాయం చేయడంలో మెగా కోడలకు ఎవరు సాటిలేరని చెప్పాలి.

ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్న ఉపాసన ఎంత మొత్తంలో సంపాదిస్తుంటారనే విషయం గురించి కూడా చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. అయితే పలు సర్వేల ప్రకారం ఉపాసన సంవత్సరానికి దాదాపు 30 కోట్లకు పైగా సంపాదిస్తారు అని తెలుస్తోంది. ఇలా ఉపాసన భారీ మొత్తంలోనే సంపాదిస్తూ ఆ సంపాదనలోనే ఇలాంటి సేవా కార్యక్రమాలను చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.