బాంబ్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అణుబాంబు. జపాన్ పై అమెరికా వేసిన బాంబ్ ఇది. ఈ ఒక్క బాంబు దాడికి జపాన్ లోని హిరోషిమా, నాగాసాకి నగరాలు తునాతునకలైపోయాయి. లక్షలాది మంది చనిపోయారు. ఒక్క బాంబు ఆ ప్రాంతాల్లో గడ్డిపోచ కూడా మొలవడానికి వీలు లేనంత విస్ఫోటనానికి గురి చేసింది. ఆరకంగా అణుబాoబు గురించి పాఠ్య పుస్తకాల్లో..ఫిజిక్స్ పుస్తకాల్లో ఎంతో గొప్పగా చదువుకున్నాం. బాంబు అంటే అణుబాంబ్ ని మించిన మరో బాంబు లేదనుకుంటాం. హైడ్రోజన్ బాంబ్ పేరు విన్నప్పటికీ దాని ప్రభావం ఎంతలా ఉంటుందన్నది బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు.
కానీ ఈ హైడ్రోజన్ బాంబు అణుబాంబును మించిన బాంబ్ అని తెలుస్తోంది. మొత్తం రెండు హైడ్రోజన్ బాంబులను సోవియట్ యూనియన్ సిద్దం చేసి పెట్టుకోగా ఒక బాంబు ని న్యూ ఐలాండ్ మీదకు వదిలింది. ఆ తర్వాత బ్యాకప్ గా మరో హైడ్రోజన్ బాంబు ను పెట్టుకుంది. దాని పేరు `ఏ ఎన్ 602` హైడ్రోజన్ బాంబ్. ఇది అణుబాంబు కన్నా ఐదు రెట్టు శక్తివంతమైనది. దీన్ని గనుక వదిలితే ప్రపంచ మ్యాపే లేకుండా పోతుందిట. అంటే దీని పవర్ ఏంటో అర్ధమవుతోంది. అమెరికా వదిలిన అణుబాంబుకే జపాన్ లో ఇప్పటికీ గడ్డిపోచ మొలవలేదంటే? ఇది ఇంకెంత విస్ఫోటానాన్ని కల్గిస్తుందో ఊహించుకోవచ్చు.
సోవియట్ యూనియన్ ఏ ఒక్క దేశంపైనైనా శత్రుత్వం తో ఈ బాంబ్ వేసిందంటే? ఆ చుట్టు పక్క దేశాలు బూడిద లో కలిసిపోవాల్సిందే. కాబట్టి ఈ బాంబ్ ని చూసి అగ్రరాజ్యం అమెరికా సైతం భయపడుతుంది. అంటే ఏ ఎన్ 602 ఎంత ప్రమాదికారో అర్ధమవుతోంది. అణుబాంబ్ ని మించిన విస్పోటనాన్ని ఏ ఎన్ 602 కల్గిస్తుంటే! జబ్బలు చరిచే అమెరికా భయపడటంలో తప్పేం లేదు. ఇక మిగతా దేశాల పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు.