కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆ తల్లి చేసిన పని తెలిస్తే ఛీ కొడతారు?

సాధారణంగా తల్లిదండ్రులకు వారి పిల్లల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. పిల్లల కోసం ఎంతో కష్టపడి వారిని ప్రయోజకులుగా చూడాలని తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి పిల్లలు అందరికన్నా గొప్పగా ఉండాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇటీవల తన కొడుకు కోసం ఒక మహిళ ఏకంగా కొడుకు స్నేహితుడికి విషం ఇచ్చి చంపటానికి ప్రయత్నించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శనివారం పుదుచ్చేరిలో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే….పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో ఉన్న ఒక ఓ ప్రైవేటు పాఠశాలలో రాజేంద్రన్, మాలతి దంపతుల కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. అయితే శుక్రవారం శుక్రవారం రాజేంద్రన్ మాలతి దంపతుల కుమారుడు ఉన్నట్లుండి స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అక్కడ సిబ్బంది హుటాహుటిన బాలుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. బాలుడు నీ పరీక్షించిన వైద్యులు బాలుడు విషం తాగటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఆ తర్వాత బాలుడు స్పృహలోకి వచ్చిన తర్వాత తాను సెక్యూరిటీ ఇచ్చిన శీతల పానీయం తాగటం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తల్లిదండ్రులకు వెల్లడించాడు.

దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం వెల్లడించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల సెక్యూరిటీ గారిని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. ఒక మహిళ తన వద్దకు వచ్చి ఈ శీతల పానీయాన్ని ఆ బాలుడికి ఇమ్మని చెప్పటంతో డబ్బుకు ఆశపడి ఇచ్చినట్లు సెక్యూరిటీ గార్డ్ వెల్లడించాడు. దీంతో పోలీసులు పాఠశాల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక మహిళ సెక్యూరిటీ గార్డ్ కి కూల్ డ్రింక్స్ బాటిల్ ఇవ్వడం గమనించారు.

సీసీ కెమెరాల ఆధారంగా అదే స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి తల్లి సహాయరాణి విక్టోరియా అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తానే ఈ నేరానికి పాల్పడినట్లు సదరు మహిళ విచారణలో అంగీకరించింది. ఎప్పుడూ తరగతిలో తన కుమారుడు ఫస్ట్ వచ్చేవాడని, కానీ కొంతకాలంగా రాజేంద్రన్, మాలతి కుమారుడు తన కుమారుడిని అధిగమించి తరగతిలో మొదటి స్థానంలో నిలుస్తున్నాడని ఆమె వివరించింది అందువల్ల తన కుమారుడి కంటే అధిక మార్కులు సాధిస్తున్న సదరు విద్యార్థి మీద కోపం పెంచుకున్న విక్టోరియా ఎలాగైనా తన కొడుకు కోసం ఆ విద్యార్థిని మట్టుబెట్టాలని ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. తన కొడుకు మీద ఉన్న ప్రేమతో ఇతర విద్యార్థి ప్రాణాలు తీయటానికి ప్రయత్నించిన సదరు మహిళపై పోలీసుల కేసు నమోదు చేసుకుని ఆమెను అరెస్టు చేశారు.