Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం తనకంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుని స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇలా హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కు రాజకీయాలపై ఆసక్తి రావడంతో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో ప్రజా రాజ్యం పార్టీ కోసం కష్టపడిన అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.
ఇలా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయ కార్యకలాపాలలో పవన్ కళ్యాణ్ ఎంతో బిజీ అయ్యారు. ఒక రాజకీయ పార్టీని నడిపించాలి అంటే డబ్బు చాలా అవసరం అవుతుంది. అయితే డబ్బు కోసమే పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇలా సినిమాలలో సంపాదించింది మొత్తం ఈయన పార్టీ కోసం కష్టపడుతూ తన పార్టీని ముందుకు నడిపిస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికలలో మాత్రం పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
జనసేన పోటీ చేస్తున్న ప్రతి ఒక్క చోట భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా ఈయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాల కోసం వీలైనప్పుడల్లా పనిచేస్తూ ఆ సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరుల్లు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా జూన్ 12వ తేదీ విడుదల కానుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్మాత ఏయం రత్నం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ జానీ సినిమాకు దర్శకత్వం వహించారు . ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా అభిమానులకు మాత్రం స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత సత్యాగ్రహి అనే సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మారారు ఆ సినిమాకు ఏయం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. అయితే అనుకోని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కారణం తెలియకపోయిన ఒకవేళ ఈ సినిమా షూటింగ్ కనుక పూర్తి చేసి ఉన్న లేకపోతే మీరొచ్చి ఈ సినిమా తప్పనిసరిగా చేయాలి అని నాపై ఒత్తిడి తెచ్చిన నేను సినిమాలలోకి వచ్చేవాడిని కాదు అమీర్ ఖాన్ లాగా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగే వాడిని అంటూ పవన్ కళ్యాణ్ నిర్మాత ఏం రత్నం వద్ద చెప్పినట్టు ఈయన వెల్లడించారు. అయితే సత్యాగ్రహి సినిమా చేయకపోవడానికి గల కారణం మాత్రం వెల్లడించలేదు.
