అక్కినేని నాగచైతన్య ఎంతగానో ప్రేమించి నటి సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 4 సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఏ కారణంగా వీరు ఇద్దరు విడిపోయారని ఇప్పటికి వీరి విడాకుల గురించి చర్చనీయాంశంగా మారింది. అయితే విడాకుల గురించి నాగచైతన్య ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ తాజాగా ఆయన నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నాగచైతన్యకు సమంత గురించి తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ నాగచైతన్యను ప్రశ్నిస్తూ మీకు కనుక సమంత ఎదురుపడితే మీరు ఏం చేస్తారనే ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ సమంత నాకు ఎదురుపడితే తనకు హాయ్ అని చెబుతా అంటూ సమాధానం చెప్పారు. విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ సమంత గురించి నాగచైతన్య ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్ చేయలేదు. సమంత అంటే తనకు చాలా గౌరవమని, ఆ గౌరవం ఎప్పటికీ తనపై ఉంటుందని ఈయన చేసిన కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి సమంత కనబడితే తాను హాయ్ అంటూ మాట్లాడుతానని నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.